వరలక్ష్మి వ్రత విధానం :

వరలక్ష్మీ వ్రతం పాటించే టప్పుడు వరలక్ష్మీ దేవిని ఎక్కడైతే కలశ స్థాపన చెయ్యాలని భావన చేస్తారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో సుద్ధి చేస్తారు. అలా గోమయంతో భూ శుద్ధి చేసి దానిమీద నూతన అంచు కలిగిన వస్త్రాన్ని పరుస్తారు. బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. అమ్మవారి మూర్తిని ఉంచే టప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి లేకపోతే వెండి మూర్తి లేకపోతే రాగి మూర్తి అది కూడా లేక పోతే కలశం ఒక్కటే పెట్టి పూజ చేసుకోవచ్చు, ఏ దోషం రాదు. కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసిన తరువాత అమ్మవారికి వివిధ ఉపచారములు చేస్తారు. పూజ ప్రారంభం చేసిన తరువాత లౌకిక సంభాషణ చేయకూడదు.

Comments