వరలక్ష్మి వ్రత కల్పానికి కావలసిన పూజా సామాగ్రి :

పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరవత్తులు, కర్పూరం, వక్కలు, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశం, కలశవస్త్రము (రవికల గుడ్డ ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము. పంచామృతములు (ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనే మరియు పంచదార). తోరము : తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి ఒకటి మీకు మిగతావి ముత్తయిదువులకు. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను, ఒక పీట మీద కొద్దిగా బియ్యము పరిచి పూర్ణకుంభంలో ( వెండి/ ఇత్తడి/ రాగి/ కంచు చెంబు లో) కొత్త బియ్యం వేసి, మరయీగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ, వేసి ఆ కుంభo మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీటమీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేయాలి.

Comments