అరిషడ్వర్గములు అను దుర్గుణములు మనవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి?

మొదటిది కామము. ధర్మ విరుద్ధమైన కోరికలతో, కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడే లా చేసి, ధన, మానాలను మనుజులకు పోగొడుతుంది. రెండవది క్రోధము. కామము వలన క్రోధము పెరిగి, ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువుల్ని దగ్గర చేస్తుంది. మూడవది లోభము. లోభము వలన తన ధనం తనకూ, తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకూ, అర్హత లేనివారికి అందుతుంది. నాలుగవది మోహము. నాది అనే భ్రమలో నీది అనునది పోగొట్టేది. ఐదవది మదము. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవీగడం. ఆరవది మాత్సర్యం, పరులను చూసి ఈర్ష్య పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకారపూరితంగా ప్రవర్తించి తన ను తాను కోల్పోవటం.  

Comments