దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ?

సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ, హోమాధుల్లో నూ, కొన్ని శుభకార్యాల్లోనూ, కొబ్బరికాయలు కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయలు స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడ నాడుతున్నామనీ లోపల ఉన్న తెల్లని కొబ్బరి లా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీళ్ల లా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తం లో నీరున్న కాయ కొబ్బరికాయే.
కొబ్బరికాయ అంటే మానవ శరీరం. కొండపైనున్న చర్మం , మన చర్మం.. పీచు మనలోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరినీరు మన ప్రాణాధారం కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.

Comments