బ్రహ్మ మూహూర్త సమయమంటే???????
కశ్యప బ్రహ్మకూ, వినతా దేవికి జన్మించిన వాడు అనూరుడు. అతడే సూర్యుడి సారధి. తల్లి వినతాదేవి పుత్రుడ్ని చూసుకోవాలనే కుతూహలంతో, ఆత్రుతతో పుట్టకముందే అండం పగల కొట్టడంతో సగం శరీరం తో జన్మించాడు.
బ్రహ్మ అతడ్ని సూర్యుడికి రధసారధి గా నియమించి, నీవు భూలోకాన ఉన్న సమయమే బ్రహ్మ కాలమని, ఆ కాల సమయమున చెడు ఆన్నది ఏ నక్షత్రాలూ, గ్రహాలు చెయ్యిలేవని వరమిచ్చి సూర్యుడి సప్తాశ్వరధానికి సారధి గా నియమించాడు.
సాదరణంగా బ్రహ్మ మూహూర్త సమయమంటే 48 నిమిషములు, బ్రహ్మ మూహూర్త కాలం రెండు మూహూర్త కాల సమయాలు సూర్యోదయం ముందర మొదలౌతుంది. ఉదా: సూర్యోదయం ఉ 6 గం లకు, బ్రహ్మ మూహూర్త కాలం 4.24 నుండి 5.12 వరకు.

Comments
Post a Comment