జపం చేసే సమయం లో చేయకూడనివి ఏవి ??? (Things not to do while chanting (japam))




జపం చేసే సమయం లో చేయకూడనివి ఏవి ??? 


                     అపరి శుభ్రంగా ఉండి జపించరాదు. అలా జపిస్తే దైవ దీవెనలకు బదులు కోపాన్ని రుచి చూడవల్సి వస్తుంది. 

                 చేతులు మురికిగా ఉండటమూ, బట్టలు లేకుండా ఉండటమూ, అనవసర విషయాలు మధ్యలో మాట్లాడటం, బహికమైన విషయాల గూర్చి ఆజ్నాపిస్తూ జపించే జపము జపము కాదు. 

          జప సమయంలో ఆవులింతా, మగతా, బద్ధకంగా ఏదో జపిస్తున్నామంటే జపిస్తున్నామంటూ చేస్తే జపం నిష్ప్రయోజనం. 

                      తుమ్ము, దగ్గు వస్తే ‘ఓంకారాన్ని పలికి ఆచమనం చేయాలి.   జంతువులను తాకితే స్నానం చేసి జపించాలి. 

                    జప సమయంలో ఏమీ తీసుకోరాదు. ఏక వస్త్రం తోనూ, అనేక వస్త్రాలతోనూ జపించకూడదు.

Comments