గుడిలో ప్రదక్షిణ ల పద్దతి ????
ద్వజ స్తంభం నుంచి మళ్ళీ ద్వజ స్తంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమైతే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్ళీ మందిర ముఖద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తి అయినట్టు. హనుమంతునకు అయిదు ప్రదక్షిణలు ప్రీతి. ఏదైనా కోర్కె వుంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణలు చేస్తే ఫలితముంటుంది.
నవగ్రహాలకి మూడుసార్లు, లేదా తొమ్మిదిసార్లు చేయచ్చు. అలాగే పాదకొండు, ఇరవై ఒకటి, ఇరవై ఏడు ఇలా బేసి సంఖ్యలో చేయవచ్చు.

Comments
Post a Comment