అలిగి అత్త వారింటికి, చెడి చెల్లిలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు ???



          అలిగి అత్త వారింటికి, చెడి చెల్లిలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు ???



                         పూర్వకాలంలో కొడుకుని సరయినదారిలో పెట్టలేకపోతే, సంవత్సరం పాటు అత్త గారింటికి పంపేవారట. అంతే శిక్షతో సమానము. మహాభారతంలో ధృతారాష్ట్రూడు తన బావమరిది శకునిని హస్తినలో ఉంచుకోవటం వల్ల ఎంత అనర్ధం జరిగిందో తెలియనిది కాదు. 
               
                   తన వారి మీద అలిగి అత్త వారింటికి వెళితే కోల్పోయేది ఆర్ధిక స్వేచ్ఛ, సాంఘిక స్వేచ్ఛలతో పాటు మానసిక ఆనందం కూడా. అలాగే చెడి చెల్లిలింటికి వెళ్లకూడదు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమా, వాత్యల్యమూ, ధనమూ ఆశిస్తుంది. అలాంటి చెల్లి ఇంటి కెళ్లి ఆ మూడు ఆమె నుంచి ఆశించటం వల్ల చులకనవుతాడు. కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తింటి చెల్లి కూడా, అందుకే చెడి చెల్లిలింటికి వెళ్ళొద్దనేది.

Comments